సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Karthikeya 2: విడుదల తేదీ ఖరారు..

ABN, First Publish Date - 2022-07-21T13:59:31+05:30

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ (Anupama Parameswaran).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ (Nikhil Siddhartha) నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ (Anupama Parameswaran). గతంలో వచ్చిన సూపర్ హిట్ ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రానికిది సీక్వెల్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ని చిత్ర బృందం ప్రకటించింది. చందుమొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వాస్తవంగా అయితే ఇదే నెల 22న విడుదల కావాలి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆగస్ట్ కు వాయిదా పడింది. 


ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 'కార్తికేయ 2' మూవీని ఆగస్టు 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించిన మేకర్స్ విడుదల తేదీతో కూడుకున్న పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


నిఖిల్ కు సోలో రిలీజ్ దొరకలేదు. దాంతో నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో పోటీగా వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద యూత్ స్టార్ నితిన్ తో నిఖిల్ పోటీ పడబోతున్నాడు. అంతేకాదు, ఈ యంగ్ హీరోలకు పోటీగా అమీర్ ఖాన్ - నాగచైతన్యల నుంచి పోటీ ఎదురు కానుంది. 'లాల్ సింగ్ చద్దా' సినిమా కూడా అదే రోజున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. మరి వీరిలో భారీ హిట్ దక్కించుకునేది ఎవరో తెలియాలంటే ఆగస్టు 12 వరకు వేచి చూడాల్సిందే. 

Updated Date - 2022-07-21T13:59:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!