సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Karthikeya 2: సెన్సార్ టాక్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-07-29T21:58:02+05:30

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ 'కార్తికేయ 2' (Karthikeya 2). తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చందు మొండేటి (Chandu Mondeti)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) నటించిన లేటెస్ట్ మూవీ 'కార్తికేయ 2' (Karthikeya 2). తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలో వచ్చిన కార్తికేయ (Karthikeya) చిత్రానికి సీక్వెల్ అని తెలిసిందే. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించి ఉండటంతో ఇప్పుడు చందు మొండేటి, నిఖిల్ కాంబోలో వస్తున్న ఈ సీక్వెల్ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.


వాస్తవంగా ఈ సినిమా జూలై 22న భారీ స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ మూవీ ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్టు కొత్త తేదీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకున్న 'కార్తికేయ 2' ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం వెల్లడించింది.


ఇక సెన్సార్ సభ్యులు.. 'ఈ మూవీలో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి..కాన్సెప్ట్ ఆలోచనను రేకెత్తించే విధంగా ఉంది'..అని తమ అభిప్రాయాన్ని తెలిపారట. ఇక ఈ సినిమా విడుదల కోసం కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీనిని బట్టి చూస్తే 'కార్తికేయ 2' గ్యారెంటీగా హిట్ అని అర్థమవుతోంది. ఇటీవల కాలంలో నిఖిల్‌కి గానీ, అనుపమకి గానీ సక్సెస్ రాలేదు. కాబట్టి వీరిద్దరికీ 'కార్తికేయ 2' హిట్ అనేది తప్పనిసరి. చూడాలి మరి ఈ మూవీతో మళ్ళీ నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ట్రాక్‌లోకి వస్తారో లేదో.  

Updated Date - 2022-07-29T21:58:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!