NTR: తారక్‌కు సీఎం నుంచి ప్రత్యేక ఆహ్వానం!
ABN, First Publish Date - 2022-10-30T01:55:12+05:30
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు నవంబర్ 1న కర్టాటక వెళ్లనున్నారు. అక్కడ విధానసౌధలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr ntr)కు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (karnataka cm Basavaraj Bommai) నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు నవంబర్ 1న కర్టాటక వెళ్లనున్నారు. అక్కడ విధానసౌధలో (Vidhana soudha)జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ (Kannada rajathotsava)వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నడ మెగాస్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటకలో విశిష్ఠ పురస్కారంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డు అందుకోనున్న తొమ్మిదో వ్యక్తి పునీత్. కర్ణాటకలో కూడా ఎన్టీఆర్‌కు మంచి క్రేజ్ ఉంది. పునీత్‌తో తారక్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే! ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి ఈ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి.