Kantara: కాసుల వర్షం.. 50 కోట్ల క్లబ్‌లోకి!

ABN , First Publish Date - 2022-11-02T23:03:18+05:30 IST

‘కాంతార’ (Kantara) చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ‘కాంతార’ చిత్రం అక్కడ బాక్సాఫీస్ వద్ద..

Kantara: కాసుల వర్షం.. 50 కోట్ల క్లబ్‌లోకి!

‘కాంతార’ (Kantara) చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ‘కాంతార’ చిత్రం అక్కడ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 15న టాలీవుడ్‌‌లో విడుదలైన ఈ చిత్రం.. ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగు భాష వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మెగా నిర్మాత అల్లు అరవింద్.. తన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేశారు. (Kantara in 50 Crores club)


తెలుగు భాషలో విడుదలైన మొదటిరోజు నుంచే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ని రాబట్టుకుంది. ఆ తర్వాత మౌత్ టాక్‌తో అందరినీ ఆకర్షించిన ఈ చిత్రం.. విడుదలైన  2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు  సాధించి.. ఇప్పుడు ఏకంగా 50 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం. ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్‌గా ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఈ సినిమా సాధించిన, సాధిస్తోన్న విజయానికి చిత్రయూనిట్టే కాకుండా.. సినిమా విడుదల చేసిన అల్లు అరవింద్ (Allu Aravind) అండ్ టీమ్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్‌కు ఈ సినిమాని సజెస్ట్ చేసింది బన్నీ వాసు అనే విషయం తెలిసిందే. బన్నీ వాసు ఈ సినిమా చూసి.. వెంటనే అల్లు అరవింద్‌కి చెప్పడం, ఆయన వెంటనే ఈ సినిమా రైట్స్ కొనేసి.. తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల చేయడం.. సినిమాలో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులకి కనెక్ట్ కావడం.. సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించి.. ఇప్పుడు రూ. 50 క్లబ్‌లో చేరడం వరసగా జరిగిపోయాయి. ఇంకా పలుచోట్ల ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటున్నారంటే.. సినిమాలో ఉన్న కంటెంట్ గొప్పతనం ఏమిటో తెలుసుకోవచ్చు. రిషభ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించడమే కాకుండా.. ఆయన దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. 



Updated Date - 2022-11-02T23:03:18+05:30 IST