కాంతారకు కోర్టులో ఎదురు దెబ్బ
ABN , First Publish Date - 2022-10-30T09:45:20+05:30 IST
కన్నడ చిత్రసీమ తాజా సంచలనం ‘కాంతార’కు కేరళ కోర్టులో చుక్కెదురు అయ్యింది. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ అనే గీతాన్ని ఇక మీదట థియేటర్లలో గానీ...

కన్నడ చిత్రసీమ తాజా సంచలనం ‘కాంతార’కు కేరళ కోర్టులో చుక్కెదురు అయ్యింది. ఈ సినిమాలోని ‘వరాహ రూపం’ అనే గీతాన్ని ఇక మీదట థియేటర్లలో గానీ, ఓటీటీ మాధ్యమాలలో గానీ ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ‘కాంతార’ చిత్రబృందాన్ని ఆదేశించింది. ‘వరాహ రూపం’ అనే గీతాన్ని తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్ నుంచి కాపీ కొట్టారని ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్రాండ్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం శనివారం కీలక తీర్పుని వెలువరించింది. ‘కాంతార’ పతాక సన్నివేశాలు పండడంతో ‘వరాహ రూపం’ పాట కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ పాటని సినిమా నుంచి తొలగించడం చిత్రబృందానికి ఎదురు దెబ్బ లాంటిదే.