కమల్‌కు అస్వస్థత

ABN , First Publish Date - 2022-11-25T08:23:28+05:30 IST

ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర సమస్యలతో ఆయన బుధవారం రాత్రి...

కమల్‌కు అస్వస్థత

ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, దగ్గు తదితర సమస్యలతో ఆయన బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేరారు. కమల్‌ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకట్రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు తెలిపారు. వరుస షూటింగులతో బిజీగా ఉన్నందున కమల్‌ అలసటకు గురయ్యారని, ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. మరోవైపు ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కూడా స్వల్ప అస్వస్థతతో గురువారం బెంగళూరులోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చేరారు. 


Updated Date - 2022-11-25T08:23:28+05:30 IST

Read more