‘భారతీయుడు–2’– కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2022-06-04T19:27:53+05:30 IST

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 20 ఏళ్ల తర్వాత శంకర్‌–కమల్‌హాసన్‌ కలయికలో రాబోతున్న చిత్రమిది. 2017లో శంకర్‌ ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2019 జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టారు. చెన్నై, రాజమండ్రి, భోపాల్‌ ప్రాంతాల్లో కొంత చిత్రీకరణ జరిపారు. 2020 ఫిబ్రవరిలో సెట్‌ జరిగిన ప్రమాదంలో పలువురు టెక్నిషియన్లు మరణించారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల చిత్రీకరణ వాయిదా పడింది.

‘భారతీయుడు–2’– కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు!

విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal hassan) ప్రధాన పాత్రలో శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఇండియన్‌ 2’(indian 2). 20 ఏళ్ల తర్వాత శంకర్‌–కమల్‌హాసన్‌ కలయికలో రాబోతున్న చిత్రమిది. 2017లో శంకర్‌ (Shankar)ఈ చిత్రాన్ని ప్రకటించారు. 2019 జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టారు. చెన్నై, రాజమండ్రి, భోపాల్‌ ప్రాంతాల్లో కొంత చిత్రీకరణ జరిపారు. 2020 ఫిబ్రవరిలో సెట్‌ జరిగిన ప్రమాదంలో పలువురు టెక్నిషియన్లు మరణించారు. ఆ తర్వాత కరోనా మహమ్మారి వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. అనుకున్న బడ్జెట్‌ దాటడం తదితర కారణాలతో దర్శకనిర్మాతలకు వివాదాలు తలెత్తడంతో షూటింగ్‌ వాయిదా పడుతూనే ఉంది. ఈలోపు కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’(Vikram) సినిమా షూటింగ్‌తో బిజీ అయ్యారు. తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కమల్‌ ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఇండియన్‌–2’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘‘ఇండియన్‌–2’(Indian 2) నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. అది ఆగిపోలేదు. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. కరోనా, సెట్‌లో యాక్సిడెంట్‌.. ఇలా పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆగింది. ప్రారంభం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చిత్రీకరణ కొనసాగించాం. సినిమా చిత్రీకరణ కోసం లైకా నిర్మాతలతో మాట్లాడాం. త్వరలో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో సెట్‌లో అడుగుపెట్టి సినిమా పూర్తి చేస్తాం. ఎందుకంటే  ఒకే సినిమాపై పదేళ్లు పని చేయలేం కదా? నాకు ఓ నిర్మాణ సంస్థ ఉంది. అలాగే శంకర్‌కూ ఓ సంస్థ ఉంది. ఈ రెండింటినీ మేం ముందుకు తీసుకెళ్లాలి. అంటే మేం బయటకెళ్లి పని చేయాలి’’ అని కమల్‌ (Kamal hassan)అన్నారు. 


Updated Date - 2022-06-04T19:27:53+05:30 IST

Read more