Kamal Haasan: నెక్ట్స్ ప్రాజెక్టు ఫిక్స్..కీలక పాత్రలో విజయ్ సేతుపతి!
ABN , First Publish Date - 2022-11-17T22:56:20+05:30 IST
ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అభిమానులందరు ముద్దుగా విశ్వ నటుడు అని పిలుస్తుంటారు. కమల్ చివరిగా నటించిన చిత్రం విక్రమ్ (Vikram).

ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అభిమానులందరు ముద్దుగా విశ్వ నటుడు అని పిలుస్తుంటారు. కమల్ చివరిగా నటించిన చిత్రం ‘విక్రమ్’ (Vikram). లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పలు భాషల్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.450కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు తర్వాత కమల్ నెక్ట్స్ సినిమా ఫిక్సయింది.
విశ్వ నటుడు కమల్ హాసన్ డైరెక్టర్ హెచ్. వినోద్ (H Vinoth) తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘కెహెచ్233’ (KH233) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రను పోషించనున్నాడట. గతంలో కమల్, విజయ్ కలసి ‘విక్రమ్’ లో నటించారు. తాజాగా మరోసారి వీరిద్దరు స్క్రీన్‌ను షేర్ చేసుకొబోతుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితమే మణిరత్నంతో సినిమా చేయనున్నట్టు తెలిపాడు. మణి సినిమాకు ముందే హెచ్. వినోద్ ప్రాజెక్టును కమల్ పూర్తి చేస్తాడని సమాచారం. గతంలో వినోద్ ‘వలీమై’ కు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో పాటు భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో అజిత్ హీరోగా నటించాడు. ప్రస్తుతం అజిత్‌తోనే ‘తూనీవు’ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.