ఆస్పత్రి నుంచి కమల్‌ డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2022-11-26T07:10:57+05:30 IST

స్వల్ప అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌ హాసన్‌ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

ఆస్పత్రి నుంచి కమల్‌ డిశ్చార్జ్‌

స్వల్ప అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌ హాసన్‌ శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆయనకు వైద్యులు సూచించారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి చెన్నైకు వచ్చిన కమల్‌ హాసన్‌ స్వల్ప దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతూ చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ యూనివర్శిటీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి చేరిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. రెండు రోజులపాటు ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆయన హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో పాటు, ‘ఇండియన్‌-2’ షూటింగ్‌లో పాల్గోనున్నారు. 

Updated Date - 2022-11-26T07:10:57+05:30 IST

Read more