సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kamal Haasan ‘విక్రమ్’ మూవీ నిడివి ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2022-05-23T23:53:22+05:30

యూనివర్సల్ హీరో (Universal Hero) కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనివర్సల్ హీరో (Universal Hero) కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‪లో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌ (R Mahendran)తో కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్‪గా నిర్మిస్తున్నారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సంబంధించి చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవల ‘పతళ పతళ’ అనే సాంగ్‪తో పాటు, చిత్ర థియేట్రికల్ ట్రైలర్‪ను కూడా విడుదల చేసి.. మేకర్స్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రన్ టైమ్ (Run Time)ను మేకర్స్ లాక్ చేశారు. 173 నిమిషాలు అంటే.. 2 గంటల 53 నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్- విజయ్ (Vijay) కాంబినేషన్ లో వచ్చిన ‘మాస్టర్’ (Master) చిత్రం కూడా దాదాపు ఇంతే నిడివితో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం కూడా అంతే నిడివితో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. 


భారీ మల్టీస్టారర్ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మరో స్టార్ హీరో సూర్య (Suriya) ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర విడుదల హక్కులను.. హీరో నితిన్ (Nithiin) హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ (Sreshth Movies) ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ (Girish Gangadharan) సినిమాటోగ్రాఫర్‪గా, ఫిలోమిన్ రాజ్ (Philomin Raj) ఎడిటర్‪గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో కనిపించనున్నారు. 



Updated Date - 2022-05-23T23:53:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!