సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నితిన్ Macherla Niyojakavargam కు కమల్ హాసన్ సపోర్ట్

ABN, First Publish Date - 2022-05-31T02:20:19+05:30

యంగ్ హీరో నితిన్ (Nithiin) హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). నితిన్ హోమ్ బ్యానర్ అయినటువంటి శ్రేష్ట్ మూవీస్‌ (Sreshth Movies)పై సుధాకర్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో నితిన్ (Nithiin) హీరోగా ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). నితిన్ హోమ్ బ్యానర్ అయినటువంటి శ్రేష్ట్ మూవీస్‌ (Sreshth Movies)పై సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy), నికితారెడ్డి (Nikitha Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల (Rajkumar Akella) సమర్పిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. అందులో భాగంగా రేపు (మంగ‌ళ‌వారం) సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘చిల్ మారో చిల్ మారో’ (Chill Maro Chill Maro)ని విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పాటకో ప్రత్యేకత ఉంది. ఉలగ నాయగన్ కమల్ హాసన్ (Ulaga Nayagan Kamal Haasan) ఈ పాటను విడుదల చేయబోతున్నారు. మంగళవారం హైదరాబాద్‌‌లో జరగనున్న కమల్ హాసన్ ‘విక్రమ్’ (Vikram) ప్రీ రిలీజ్ వేడుకలో ఈ పాటను విడుదల చేయనున్నారు. కమల్ హాసన్ ‘విక్రమ్’ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.


‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలోని మొదటి పాటని కమల్ హాసన్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నితిత్ కార్నివాల్‌ స్టైలిష్ పోజ్‌లో చురుగ్గా, ఆనందంగా కనిపిస్తున్నారు. కాగా.. ఈ మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌ టైనర్‌కు మహతి స్వర సాగర్ (Mahati Swara Sagar) సంగీతం అందిస్తుండగా... ప్రసాద్ మూరెళ్ల (Prasad Murella) సినిమాటోగ్రాఫర్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు.



Updated Date - 2022-05-31T02:20:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!