నా మాట నమ్మలేదు.. నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు: Kamal Haasan
ABN , First Publish Date - 2022-06-18T02:51:42+05:30 IST
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్‌తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో..
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘విక్రమ్’ (Vikram). కమల్‌తో పాటు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం.. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రానికి కలెక్షన్లు స్టడీగా ఉండటం విశేషం. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ విజయంతో కమల్ హాసన్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆర్. మహేంద్రన్ (R Mahendran)తో కలిసి.. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్‌పై స్వయంగా తనే నిర్మించిన కమల్ హాసన్.. ఈ విజయానందంలో యూనిట్‌కు బహుమతులు పంచుతున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేష్‌కు కారు, హీరో సూర్య (Suriya)కు వాచ్ వంటివి ఆయన బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా, చిత్ర సక్సెస్ మీట్లలో కూడా ఆయన హుషారుగా పాల్గొంటున్నారు. రీసెంట్గా జరిగిన ఓ సక్సెస్ మీట్లో ఆయన గతంలో అన్నటువంటి ఓ మాటను గుర్తు చేసుకున్నారు. అదేమిటంటే.. ‘‘నేను రూ. 300 కోట్ల రూపాయలను సంపాదిస్తాను అంటే.. అందరూ నన్ను పిచ్చోడిలా చూశారు. ఇప్పుడది నిజమైంది కదా..’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఈ విజయంతో చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. సినిమా అన్నిచోట్ల బ్రహ్మాండంగా ఆడుతుంది. ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను. గతంలో నేనొకసారి రూ. 300 కోట్లు సంపాదించగలను అంటే.. అందరూ నవ్వుకున్నారు. నా మాట నమ్మలేదు.. పైగా నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశారు. అప్పుడు వాళ్లకి అర్థం కాలేదు. ఇప్పుడు నేను తీసిన ‘విక్రమ్’ సినిమా నా మాటను నిజం చేసింది. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో నా అప్పులన్నీ తీరిపోయాయి. నాకు కావాల్సింది తింటున్నాను. నా సన్నిహితులకు చేతనైన సహాయం అందిస్తున్నాను. నా దగ్గర డబ్బులు ఉన్నంతకాలం సహాయం చేస్తాను. ఒకవేళ డబ్బులు అయిపోతే.. నా దగ్గర లేవని చెప్పేస్తాను. అంతే తప్ప.. వేరే వాళ్ల దగ్గర తీసుకుని మరీ సాయం చేయాలనేంత గొప్ప మనసు నాకు లేదు. గొప్ప పేరు రావాలని నేను ఆశించడం లేదు. మంచి మనిషిగా ఉంటే చాలని అనుకుంటున్నాను..’’ అని కమల్ చెప్పుకొచ్చారు.