సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kalyan Ram: బాబాయ్ మూవీపై క్లారిటీ..

ABN, First Publish Date - 2022-08-04T14:59:46+05:30

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తన బాబాయ్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా సొంత నిర్మాణ సంస్థలో రూపొందనున్న సినిమాపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బింబిసార (Bimbisara).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తన బాబాయ్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా సొంత నిర్మాణ సంస్థలో రూపొందనున్న సినిమాపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం బింబిసార (Bimbisara). ఈ మూవీతో మల్లిడి వశిష్ఠ్ (Mallidi Vaishst) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా ఆగస్టు 5న భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం వుతోంది. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) పతాకంపై కె హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.


ఇప్పటికే వచ్చిన ప్రతీ అప్‌డేట్‌తో ఈ చిత్రంపై నందమూరి అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మువీ ప్రమోషన్స్‌ని మేకర్స్ నాన్‌స్టాప్‌గా జరుపుతున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్, మూవీ గురించి.. అలాగే తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నుంచి తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.."ఆర్ ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గొప్ప పేరు సంపాదించారు. తనతో నెక్స్ట్ చేయబోయే మూవీ అందరి అంచనాలు అందుకునేలా ఎంతో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాము. అందుకే, ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అవుతోంది. అలాగే బాబాయ్ బాలయ్యతో మా ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఒక సినిమా చేయాలనుకున్నాము. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తప్పకుండా మా బ్యానర్ లో బాలయ్య బాబాయ్ తో అందరినీ అలరించే స్థాయిలో ఒక భారీ మూవీ ఉంటుంది" అని కన్‌ఫర్మ్ చేశారు. దాంతో ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడుంటుందా..! అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2022-08-04T14:59:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!