Bimbisara Release Trailer: ‘జగత్ జజ్జరిక’
ABN , First Publish Date - 2022-07-27T23:27:05+05:30 IST
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR Arts) పతాకంపై హరికృష్ణ. కె (Harikrishna K) నిర్మించిన
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR Arts) పతాకంపై హరికృష్ణ. కె (Harikrishna K) నిర్మించిన ఈ చిత్రంతో వశిష్ఠ్ (Vassishta) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. విడుదల దగ్గర పడటంతో తాజాగా రిలీజ్ ట్రైలర్ అంటూ మరో పవర్ ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్లో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని చూపించారు.
‘హద్దులను చెరిపేస్తూ.. మన రాజ్యపు సరిహద్దులు ఆపే ఈ రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష...ఎదిరిస్తే మరణం’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్లో ‘ఈ కలల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడు వస్తున్నాడు చూడు’.. ‘నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. ఈ బింబిసారుడి కత్తిని దాటాలి’.. ‘జగత్ జజ్జరిక’ అనే డైలాగ్స్, అద్భుతమైన విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ ట్రైలర్.. సినిమాపై భారీ అంచనాలను పెంచేదిగా ఉంది. అంతే కాదు.. కథలోని రెండు కోణాలను టచ్ చేస్తూ.. బింబిసారుడు చేసిన యుద్ధాన్ని కూడా ఈ ట్రైలర్లో పరిచయం చేశారు. ‘బాహుబలి’ (Bahubali), ‘మగధీర’ (Magadheera) షేడ్స్ కనిపిస్తున్నా.. ఏదో కొత్త పాయింట్ అయితే ఈ సినిమాలో ఉండబోతుందనేలా ఈ ట్రైలర్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఆగస్ట్ 5 ‘జగత్ జజ్జరికే’ అనేలా ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీగా హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. కాగా, నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఈ చిత్రంలో క్యాథరిన్ ట్రెసా (CatherineTresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్లుగా నటించారు. ఎమ్. ఎమ్ కీరవాణి (M. M. Keeravani)తో పాటు పలువురు సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేయడం విశేషం.