‘బంగార్రాజు’ దర్శకుడి సమర్పణలో ‘లంబసింగి’
ABN, First Publish Date - 2022-04-15T00:41:20+05:30
‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని పొందిన కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వంలో
‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని పొందిన కళ్యాణ్ కృష్ణ కురసాల సమర్పణలో కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత జీకే మోహన్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ గాంధీ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లంబసింగి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. భరత్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా టైటిల్‌తో పాటు చిత్రంలోని మొదటి పాట ‘నచ్చేసిందే నచ్చేసిందే’ సాంగ్ ప్రోమోని కూడా విడుదల చేశారు.
మెస్మరైజ్ చేస్తున్న ఈ రొమాంటిక్ మెలోడీని సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. ఆర్ఆర్ దృవన్ స్వరాలను సమకూర్చారు. హీరోహీరోయిన్లపై ఈ పాటను చిత్రీకరించారు. సిద్ శ్రీరామ్ వాయిస్‌లో వచ్చిన ఈ పాట ప్రోమో.. పూర్తి పాట కోసం ఎదురుచూసేలా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. పూర్తి పాటను ఏప్రిల్ 16న చిత్రయూనిట్ విడుదల చేయనుంది. కాగా, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.