సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Indian 2: కాజల్‌ కష్టపడుతోంది!

ABN, First Publish Date - 2022-09-26T00:52:31+05:30

అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ మళ్లీ సెట్‌లో సందడి చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. బిడ్డకు జన్మనివ్వడం, ఏడాదిపాటు షూటింగ్‌కి గ్యాప్‌ రావడంతో కాస్త లావైన కాజల్‌ బాడీ ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ (Kajal) మళ్లీ సెట్‌లో సందడి చేయడానికి కసరత్తులు చేస్తున్నారు. బిడ్డకు జన్మనివ్వడం, ఏడాదిపాటు షూటింగ్‌కి గ్యాప్‌ రావడంతో కాస్త లావైన కాజల్‌ బాడీ ఫిట్‌నెస్‌ (Fitness)కోసం కసరత్తులు చేస్తున్నారు. తన తాజా చిత్రం ‘ఇండియన్‌ –2’ (Indian 2) కోసం వర్కవుట్స్‌ మొదలుపెట్టారు. గుర్రపు స్వారీ, మార్షల్‌ ఆర్ట్స్‌తోపాటు కేరళకు చెందిన కళరిపయట్టు’ నేర్చుకుంటున్నారు. దీని గురించి కాజల్‌ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. ‘‘కళరి అనేది కేరళలోని ఓ పురాతన యుద్థ కళ. దీని నుంచే కరాటే, తైక్వాండో, కుంగ్‌ ఫు వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ పుట్టుకొచ్చాయి. గెరిల్లా యుద్థానికి దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా బలపడొచ్చు. మూడేళ్ల క్రితం సమరం దొరికినప్పుడు నేర్చుకున్నా’’ అని ‘ఇండియన్‌2’ టైటిల్‌ను ట్యాగ్‌ చేశారు. కమల్‌హాసన్‌ (kamal hassan)హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్‌ (Shankar)దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో విడుదలైన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. 




Updated Date - 2022-09-26T00:52:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!