సమంత, రష్మికలను పక్కకు నెట్టిన Kajal Agarwal
ABN , First Publish Date - 2022-06-28T17:51:03+05:30 IST
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ (Google Search) లో ఉన్న టాప్ మోస్ట్ ఏసియన్స్ లిస్ట్ వచ్చింది. వారిలో సౌత్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్ (Kajal Agrawal), సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu), రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కూడా చోటు దక్కించుకున్నారు.
ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ (Google Search) లో ఉన్న టాప్ మోస్ట్ ఏసియన్స్ లిస్ట్ వచ్చింది. వారిలో సౌత్ బ్యూటీస్ కాజల్ అగర్వాల్ (Kajal Agrawal), సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu), రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కూడా చోటు దక్కించుకున్నారు. అయితే సామ్, రష్మికలను కాజల్ అగర్వాల్ పక్కకు నెట్టింది. లిస్ట్ లో కాజల్ స్థానం 15 అయితే, సమంత 18, రష్మికా 20 స్థానాల్ని ఆక్రమించారు. నాగచైతన్య (Naga Chaitanya)తో విడిపోయిన తర్వాత సమంతకు సోషల్ మీడియాలో పలు విమర్శలు చుట్టుముట్టాయి. వాటికి తనదైన స్థాయిలో సమాధానం చెబుతూ.. హల్ చల్ చేసింది. ఆ కారణంగా సామ్ పేరును గూగుల్లో చాలా సార్లు సెర్చ్ చేశారు నెటిజెన్స్. రష్మికా మందణ్ణ ‘పుష్ప’ (Pushpa) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఆ సినిమాలోని ఆమె డ్యాన్స్, డైలాగ్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఈ కారణంగా గూగుల్ సెర్చ్ లో రష్మికా పేరు కూడా తెగ యూజ్ అయింది.
ఇక కాజల్ విషయానికొస్తే.. ఈ ఏడాది కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ (Gowtham Kichlu) దంపతులకు పండంటి బాబు జన్మించాడు. కాజల్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండ్ అవుతూ వచ్చింది. అలాగే.. ఆమె బేబీ బంప్ ఫోటో షూట్ తెగ వైరల్ అయింది. ఈ కారణంగా కాజల్ అగర్వాల్ సామ్, రష్మికలను పక్కకు నెట్టి.. గూగుల్ సెర్చ్ లో టాప్ మోస్ట్ సౌత్ బ్యూటీగా నిలిచింది. ఇక ఈ లిస్ట్ లో V అనే కొరియన్ మ్యూజిక్ ఆల్బమ్ నెం.1 గా నిలిచింది.
గూగుల్ సెర్చ్ టాప్ 30 లిస్ట్ చూస్తే..
1. వి
2. జంగ్ కుక్
3. సిద్ధూ మూసే వాలా
4. జిమిన్
5. లతా మంగేష్కర్
6. లిసా
7. కత్రినా కైఫ్
8. ఆలియా భట్
9. ప్రియాంకా చోప్రా
10. విరాట్ కోహ్లీ
11. సల్మాన్ ఖాన్
12. షారుఖ్ ఖాన్
13. సుగ
14. జెన్నీ
15. కాజల్ అగర్వాల్
16. కరీనా కపూర్
17. యుజురు హన్యు
18. సమంతా రుత్ ప్రభు
19. అల్లు అర్జున్
20. రష్మికా మందణ్ణ
21. ఇలు
22. విజయ్
23. జిన్
24. జాకీ చాన్
25. అక్షయ్ కుమార్స
26. ఐశ్వర్యారాయ్
27. జిసు
28. దీపికా పదుకొణే
29. రోజ్
30. కెకె