సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jr Pawan Kalyan హీరోగా.. ‘చింతామణి సొంత మొగుడు’

ABN, First Publish Date - 2022-08-09T22:32:01+05:30

శ్రీ స్కందాగ్రజ పతాకంపై రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) (జూనియర్ పవన్ కళ్యాణ్), మధు ప్రియ (Madhu Priya) (‘మగువ’ ఫేమ్).. జంటగా శివ నాగేశ్వరావు వీరేళ్ళ (Siva Nageswara Rao Veerella) స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ స్కందాగ్రజ  పతాకంపై  రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) (జూనియర్ పవన్ కళ్యాణ్), మధు ప్రియ (Madhu Priya) (‘మగువ’ ఫేమ్).. జంటగా శివ నాగేశ్వరావు వీరేళ్ళ (Siva Nageswara Rao Veerella) స్వీయ దర్శకత్వంలో  రూపొందుతోన్న చిత్రం ‘చింతామణి సొంత మొగుడు’ (Chinthamani Sontha Mogudu). ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ను  హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి.. ఈ చిత్రంలోని పాటలను విడుదల చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో..


చిత్ర దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ మాట్లాడుతూ.. ‘‘చింతామణి సొంత మొగుడు.. ఈ సినిమాలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్ Jr Pawan Kalyan) నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రూపంతో పాటు వాయిస్ కూడా సేమ్ అలాగే  ఉండటంతో.. అందరూ తనని జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. తనకు జోడీగా ‘మగువ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మధు ప్రియ నటిస్తున్నారు. ‘చింతామణి సొంత మొగుడు’ అంటే కొంతమంది వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా మంది ఆర్టిస్టులు ఉన్న ఈ సినిమాలో ఎవరు చింతామణికి సొంత మొగుడు అవుతారు అనేదే సస్పెన్స్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా తెరకెక్కించడం జరిగింది. చూసిన  ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటివరకు మూడు పాటలు, ఒక ట్రైలర్, టీజర్ రిలీజ్ అయ్యాయి. మిగిలిన ఒక పాటను త్వరలో రిలీజ్ చేస్తాము. పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అని తెలిపారు.


చిత్ర హీరో రాజేంద్ర ప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్) మాట్లాడుతూ.. ‘‘ఒక సామాజిక  స్పృహ, సమాజం పట్ల బాధ్యత కలిగి సినిమా రంగంపై ఉన్నటువంటి మక్కువతో..  ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపనతో ప్రొడ్యూసర్, డైరెక్టర్.. ఇలా రెండు బాధ్యతలను తనే నిర్వహిస్తూ.. ఎంతో వ్యయ ప్రయాసలతో దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇలాంటి మంచి  సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరం. మా కళ్యాణ్ (Kalyan) అన్న అభిమానులు అందరూ ఈ సినిమాను ఆదరించి విజయం సాధించేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా హాజరైన అతిథులు, ఇతర ఆర్టిస్టులు సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.



Updated Date - 2022-08-09T22:32:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!