సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సదా మీ ప్రేమకు బానిసను: NTR

ABN, First Publish Date - 2022-05-28T15:31:11+05:30

ఈరోజు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 100వ జయంతి. ఈ సందర్భంగా తన తాతయ్యని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు జూయర్ ఎన్టీఆర్‌ (Jr NTR).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈరోజు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 100వ జయంతి. ఈ సందర్భంగా తన తాతయ్యని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR). ఈ నేపథ్యంలో 'సదా మీ ప్రేమకు బానిసను'..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మన తెలుగు చిత్రపరిశ్రమకి, తెలుసు సినిమాకి ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చిన మొట్టమొదటి లెజండరీ హీరో నందమూరి తారక రామారావు. కేవలం తెలుగు సినిమా కోసమే కాకుండా, తెలుగు ప్రజల కోసం ఏపీ రాజకీయాల్లోనూ ఏ ఒక్కరూ ఊహించని విధంగా మార్పులు తీసుకొచ్చి తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం రాత్రింబవళ్ళు శ్రమించారు. 


అందుకే, ఎన్టీఆర్‌తో ప్రతి ఒక్క తెలుగువారికి ఓ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. ఇక నందమూరి వారి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కి తన తాతపైన ఉండే ప్రేమ మాటల్లో చెప్పలేనిది. తాను ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా సీనియర్ ఎన్టీఆర్ నామ స్మరణ మాత్రం మానుకోరు. అంతగా తన తాతయ్య పట్ల ప్రేమను, గౌరవాన్ని మనసులో నింపుకొని ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా తన తాతయ్యని స్మరించుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.


ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిలో.. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను”.. అంటూ ఎన్టీఆర్ ఎంతో భావోద్వేగంతో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నందమూరి అభిమానుల హృదయాలను కదిలిస్తోంది. 



Updated Date - 2022-05-28T15:31:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!