Jani Master: హీరోగా జానీ మాస్టర్.. సినిమా పేరేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-08-23T03:00:31+05:30 IST

అప్పుడెప్పుడో 2020లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇది ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ.. ఆ చిత్రం ఏమయిందో ఇప్పటికీ ఆచూకీ లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన హీరోగా

Jani Master: హీరోగా జానీ మాస్టర్.. సినిమా పేరేంటో తెలుసా?

అప్పుడెప్పుడో 2020లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఇది ఎంత మందికి గుర్తుందో తెలియదు కానీ.. ఆ చిత్రం ఏమయిందో ఇప్పటికీ ఆచూకీ లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన హీరోగా ‘యథా రాజా తధా ప్రజా’ (Yatha Raja Tatha Praja) అనే టైటిల్‌తో చిత్రానికి సోమవారం శ్రీకారం చుట్టారు. జానీ మాస్టర్ (Jani Master), ‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ (Vikas) హీరోలుగా, శ్రష్టి వర్మ (Shrasti Verma) హీరోయిన్‌గా.. శ్రీనివాస్ విట్టల (Srinivas Vittala) దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మించనున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రానికి హీరో శర్వానంద్ క్లాప్ కొట్టగా.. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు కుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో..


దర్శక - నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ.. ‘‘హరీష్ పటేల్‌తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నాను. దీనికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాను. కథ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరికి అయితే బావుంటుందని ఆలోచిస్తున్న క్రమంలో జానీగారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన కథలు వింటున్నారు. నేను 20 నిమిషాల్లో కథ చెప్పగా... కీలక అంశం నచ్చి ఓకే చేశారు. రాజకీయ వార్తలు అంటే గతంలో పది నిముషాలు టీవీల్లో చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు వస్తున్నాయి. రాజకీయం అనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించే అంశమైంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వినోదాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ 15 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. మూడు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాం. రధన్‌గారు సంగీతం అందిస్తున్నారు..’’ అని తెలిపారు. (Yatha Raja Tatha Praja Movie Opening)


జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి (Chiranjeevi)గారి పుట్టినరోజున మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విషయానికి వస్తే... శ్రీనివాస్‌గారు చెప్పిన కథ వినగానే నచ్చింది. జానీ మాస్టర్ అంటే డ్యాన్స్, కమర్షియల్ అంశాలు కాకుండా మంచి కథతో వస్తే బావుంటుందని నిర్ణయం తీసుకున్నాను. ‘సినిమా బండి’ చూశా. వికాస్ బాగా చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. 'యథా రాజా తధా ప్రజా' టైటిల్ ఐడియా మాకు ఇచ్చింది రైటర్ నరేష్ గారు. ఆయనకు థాంక్స్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా టీమ్‌ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రష్టి వర్మ, మరో హీరో వికాస్, గణేష్ మాస్టర్ వంటి వారు మాట్లాడుతూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు.

Updated Date - 2022-08-23T03:00:31+05:30 IST

Read more