Janhvi kapoor: ఆ నింద మోస్తూనే ఉన్నా.. పోరాటం చేస్తూనే ఉంటా!

ABN , First Publish Date - 2022-11-02T00:47:14+05:30 IST

‘మిలీ’ చిత్రంలో పోషించిన పాత్ర నటిగా నాకు సవాల్‌ విసిరింది. నటనరంగంలో ఎదురైన సవాళ్లను స్వీకరించి ముందుకెళ్తేనే అసలైన నటన బయటకు వస్తుందని అమ్మ చెబుతుండేది. ఈ సినిమా విషయంలో అదే ఫాలో అయ్యా’’ అని శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ అన్నారు.

Janhvi kapoor: ఆ నింద మోస్తూనే ఉన్నా.. పోరాటం చేస్తూనే ఉంటా!

‘మిలీ’ (Mili)చిత్రంలో పోషించిన పాత్ర నటిగా నాకు సవాల్‌ విసిరింది. నటనరంగంలో ఎదురైన సవాళ్లను స్వీకరించి ముందుకెళ్తేనే అసలైన నటన బయటకు వస్తుందని అమ్మ చెబుతుండేది. ఈ సినిమా విషయంలో అదే ఫాలో అయ్యా’’ అని శ్రీదేవి (Sri devi) తనయ జాన్వీకపూర్‌ (Janhvi kapoor)అన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘మిలీ’. మైనస్‌ 16 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా ఆమె ఈ చిత్రంలో నటించారు. మలయాళ చిత్రం ‘హెలెన్‌’కు రీమేక్‌గా మత్తుకుట్టి జేవియర్‌ తెరకెక్కించిన ఈ  చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 




అమ్మ చెప్పిందే.. చేస్తున్నా..

నిరంతరం పని చేస్తూ ఉంటేనే ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండగలం అని అమ్మ చెప్పింది. మన పనిని నిజాయతీగా, అవిశ్రాంతంగా చేేస్త ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది నా జర్నీలో నేర్చుకున్నా. సినిమా బ్యాగ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ఇప్పటికీ నాపై విమర్శలు వస్తుంటాయి. టాలెంట్‌ లేని నటి అని కామెంట్లతో నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ విషయం మాట్లాడటానికి నాకు కొంచెం సమయం పట్టింది. నేను కష్టపడి పనిచేేస అమ్మాయిని. నన్ను నేను నిరూపించుకునేందుకు, విమర్శించేవారికి నేనేంటో తెలియజేేసందుకు యుద్థం చేస్తూనే ఉంటా’’ అని జాన్వీ సవాల్‌ విసిరారు. 



‘‘ఇందులో మిలీ నౌదియార్‌ బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థిగా కనిపిస్తా. పాత్రకు కావలసినట్లుగా 7.5 కేజీల బరువు పెరిగా. ఈ విషయంలో  శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడ్డా.  నేను పోషించిన పాత్ర రోజులో 15 గంటలపాటు ఫ్రీజర్‌లో ఉండి,  అక్కడ ఓ ఎలుక వేళ్లను కొరుకుతుంటే ఎలా ఉంటుంది? ఊహించడమే కష్టంగా  ఉంటుంది కదా అలాంటి నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. ఫ్రిడ్జ్‌లో నన్ను పెట్టినట్లు ఉండేది. ఆ మంచులో ముక్కు నుంచి రక్తం వచ్చేది. చలికి తట్టుకోలేక శరీరం అదోలా అయిపోయేది. దానికి సంబంధించిన దృశ్యాలు కలలోకి వచ్చేవి. సరిగా నిద్రపట్టేది కాదు. దీంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజులు పెయిన్‌ కిల్లర్స్‌ వాడాను. దర్శకుడు అస్వస్థతకు గురయ్యారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. 


Updated Date - 2022-11-02T00:47:14+05:30 IST