Ravi Teja: రవితేజ 'ధమాకా' లో జబర్దస్త్ స్కిట్స్ అంట

ABN , First Publish Date - 2022-09-24T20:38:52+05:30 IST

Ravi Teja: రవితేజ 'ధమాకా' లో జబర్దస్త్ స్కిట్స్ అంట

Ravi Teja: రవితేజ 'ధమాకా' లో జబర్దస్త్ స్కిట్స్ అంట

సీనియర్ నటుడు రవితేజ (Ravi Teja) నక్కిన త్రినాథ రావు (Nakkina Trinadha Rao) దర్శకత్వం లో 'ధమాకా' (Dhamaka) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అవుతోంది కూడా. శ్రీలీల (Sree Leela) కథానాయికగా (Female lead) చేస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాలో జబర్దస్త్ స్కిట్స్ (Jabardasth skits) లాంటి స్కిట్స్ ఎక్కువగా వుండే అవకాశం వుంది అని అంటున్నారు. 


ఎందుకంటే, ఈ సినిమా దర్శకుడు త్రినాథ్, జబర్దస్త్ షో తో బాగా ప్రాచుర్యం పొందిన హైపర్ ఆది (Hyper Aadi) బెస్ట్ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ (Close Friends) అంట. అందుకని త్రినాథ్ ఈ సినిమా కోసం ఆదితో కొన్ని స్కిట్స్ రాయించుకున్నాడని తెలిసింది. అందువల్ల ఈ సినిమాలో అక్కడక్కడా జబర్దస్త్ స్కిట్స్ కనపడతాయి అని తెలిసింది. జబర్దస్త్ అనే షో టీవీలో చూడటానికి బాగుటుంది కానీ, అదే స్కిట్ పెద్ద స్క్రీన్ మీద పాపులర్ నటులు వేస్తె బాగోదు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఈమధ్య రవితేజ కథ మీద అస్సలు దృష్టి పెట్టడం లేదు అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అతను దర్శకుడు చెప్పింది చేసుకుపోవటం తప్ప, ఎలా తీస్తున్నాడు, ఏమి తీస్తున్నాడు, కథ కనెక్టివిటీ ఉందా లేదా చూడటం లేదు అని అంటున్నారు. దీనివల్ల సినిమా తొదరగా ఫినిష్ చేసే అవకాశాలు వున్నాయి. రవి తేజ కి కూడా కావాల్సింది అదే, ఎందుకంటే తన డిమాండ్ వున్నప్పుడే వీలయినన్ని ఎక్కువ సినిమాలు చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే మొహం లో ముసలి లక్షణాలు బాగా కనపడుతున్నాయి, ఇంకో రెండు మూడు సంవత్సరాల తరువాత ప్రేక్షకులు పట్టించుకోరేమో?

Updated Date - 2022-09-24T20:38:52+05:30 IST