ఇది భార్యాభర్తల కుస్తీ!

ABN , First Publish Date - 2022-11-30T05:01:31+05:30 IST

‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అందుకే టాలీవుడ్‌ ఇంతలా ఎదిగింది. మిగిలిన భాషలూ తెలుగు పరిశ్రమనే ఫాలో అవుతున్నాయి...

ఇది భార్యాభర్తల కుస్తీ!

‘‘తెలుగు ప్రేక్షకులు సినిమాని ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు. అందుకే టాలీవుడ్‌ ఇంతలా ఎదిగింది. మిగిలిన భాషలూ తెలుగు పరిశ్రమనే ఫాలో అవుతున్నాయి’’ అన్నారు ఐశ్వర్య లక్ష్మీ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి రవితేజ నిర్మాత. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ ‘‘మూడేళ్ల క్రితమే దర్శకుడు నాకు ఈ కథ చెప్పారు. చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాత్రకు న్యాయం చేయగలనా, లేదా? అనే అనుమానం వేసింది. దర్శకుడికీ అదే విషయం చెప్పా. ఆ తరవాత కొవిడ్‌ వచ్చింది. ఈ గ్యాప్‌లో మూడు సినిమాలు చేశా. ఆ అనుభవంతోనే ‘మట్టి కుస్తీ’ సినిమా ఒప్పుకొన్నా. ఇది ఓ ఫ్యామిలీ డ్రామా. ఒకరకంగా చెప్పాలంటే భార్యాభర్తల కుస్తీ. ఓ స్పోర్ట్స్‌ డ్రామాలో అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉండడం చాలా అరుదైన విషయం. ఆడ, మగ ఇద్దరూ సమానమే అనే విషయాన్ని చాలా వినోదాత్మకంగా చెప్పారు. విష్ణు విశాల్‌కి సినిమా అంటే ప్రేమ. అది తప్ప మరో ఆలోచన ఉండదు. అలాంటి హీరోతో పనిచేయడం నిజంగా అదృష్టం. రవితేజ మా కథనీ, విశాల్‌నీ బాగా నమ్మారు. అందుకే ఆయన ఒక్కసారి కూడా సెట్‌కి రాలేదు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసి చాలా ఆనందించారు. ఆయన నమ్మకాన్ని మేమంతా నిలబెట్టుకొంటాం’’ అన్నారు. 


Updated Date - 2022-11-30T05:01:31+05:30 IST

Read more