సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇది అమ్మాయిల దండుపాళ్యం

ABN, First Publish Date - 2022-01-29T10:50:30+05:30

రాగిణి ద్వివేది, మేఘనా రాజ్‌ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. మహేశ్‌ దర్శకత్వంలో సి. పుట్టస్వామి నిర్మించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాగిణి ద్వివేది, మేఘనా రాజ్‌ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. మహేశ్‌ దర్శకత్వంలో సి. పుట్టస్వామి నిర్మించారు. ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా సి పుట్టస్వామి మాట్లాడుతూ  ‘తెలుగు, కన్నడ భాషల్లో ‘దండుపాళ్యం’ సిరీస్‌ సక్సెస్‌ అయింది. ‘రియల్‌ దండుపాళ్యం’ వాటిని మించేలా ఉంటుంది. మగాళ్ల వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్‌ దండుపాళ్యం’ అన్నారు. నటి రాగిణి ద్వివేది మాట్లాడుతూ ‘నేను నటించిన చిత్రం తెలుగులో విడుదలవడం ఇదే తొలిసారి. సవాల్‌గా తీసుకొని ఈ సినిమాను చేశాను’ అని చెప్పారు. ‘ప్రతి మహిళా ఈ సినిమా చూడాలి. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి’ అని పర్వతారోహకురాలు మాలోవత్‌ పూర్ణ అన్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర దర్శకుడు చెప్పారు.


Updated Date - 2022-01-29T10:50:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!