ఐటెమ్‌ రాజా... పటాస్‌ పిల్ల

ABN , First Publish Date - 2022-01-25T05:57:39+05:30 IST

సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. నేహా శెట్టి కథానాయిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు...

ఐటెమ్‌ రాజా... పటాస్‌ పిల్ల

సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డిజె టిల్లు’. నేహా శెట్టి కథానాయిక. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రంలోని ‘రాజ రాజ ఐటం రాజా.. పటాస్‌ పిల్ల.. పటాస్‌ పిల్ల’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. అనిరుథ్‌ ఆలపించిన ఈ గీతాన్ని కిట్టు విస్సాప్రగడ రచించారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలు అందించారు. విజయ్‌బిన్ని నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా కిట్టు విస్సాప్రగడ మాట్లాడుతూ ‘‘సంగీత దర్శకుడు శ్రీచరణ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. తనకు దాదాపు 30 పాటలు రాశాను. ఈ పాటకు సంబంధించి ముందు పల్లవి వరకూ ట్యూన్‌ పంపారు. హుక్‌ లైన్‌ ఒకటి ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే ‘పటాసు పిల్ల’ అనే లైన్‌ పట్టాను. అది అందరికీ బాగా నచ్చింది. ఆ తరవాత.. మిగిలిన పాట చక చకా రాసేశాను’’ అన్నారు. ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకూ మంచి స్పందన వస్తోందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. 


Updated Date - 2022-01-25T05:57:39+05:30 IST