అలా అనుకుంటే కష్టం

ABN , First Publish Date - 2022-12-29T01:33:05+05:30 IST

అతి కొద్దికాలంలోనే అగ్రకథానాయికగా ఎదగడమే కాదు ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు రష్మిక మందన్న...

అలా అనుకుంటే కష్టం

అతి కొద్దికాలంలోనే అగ్రకథానాయికగా ఎదగడమే కాదు ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు రష్మిక మందన్న. కన్నడ చిత్రం ‘కిరిక్‌ పార్టీ’తో అరంగేట్రం చేసిన ఈ సుందరి తెలుగులో అగ్రకథానాయికగా ఎదిగారు. తమిళ చిత్రాల్లో నటించడంతో పాటు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ పాగా వేశారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు అందుకున్నా తనను తానో గొప్ప నటిగా అనుకోనని రష్మిక అన్నారు. అలాంటి ఆలోచన కలిగితే నాలోని ప్రతిభని వెలికితేవాలనే ఉత్సాహం, ఇంకా సాధించాలనే తపన తగ్గిపోతాయని ఆమె అన్నారు. ‘కెరీర్‌లో కొన్ని అపజయాలు తప్పవు. అలాంటప్పుడు నన్ను నేను విశ్లేషించుకుంటాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అని ఆలోచిస్తాను. అపజయానికి ఎవరినీ బాధ్యులను చేయను. అలాగే ఒక సినిమా హిట్టయినప్పుడు కూడా అది ఏ ఒక్కరి ప్రతిభ వల్లో దక్కలేదనే అవగాహనతో ఉంటాను. అందుకే జయాపజయాలను పట్టించుకోకుండా కెరీర్‌లో ముందుకెళుతున్నాను’ అన్నారు రష్మిక మందన్న.

Updated Date - 2022-12-29T01:33:05+05:30 IST

Read more