ఎంగేజింగ్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-02T05:08:59+05:30 IST

‘‘రిపీట్‌’ చిత్రంలో మధుబాల గారితో కలసి నటించడం గొప్ప సంతృప్తినిచ్చింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది...

ఎంగేజింగ్‌గా ఉందని ప్రశంసిస్తున్నారు

‘‘రిపీట్‌’ చిత్రంలో మధుబాల గారితో కలసి నటించడం గొప్ప సంతృప్తినిచ్చింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది.  సినిమా ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉందని చూసినవాళ్లు ప్రశంసిస్తున్నారు’ అని నవీన్‌చంద్ర అన్నారు. అరవింద్‌ శ్రీనివాసన్‌ దర్శకత్వంలో నవీన్‌చంద్ర హీరోగా నటి ంచిన చిత్రం ఇది. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. 


ఈ సినిమా తమిళ చిత్రం ‘డెజావు’కు తెలుగు వెర్షన్‌. ఇందులో విక్రమ్‌ అనే పాత్రలో నటించాను. ఏకబిగిన చిత్రీకరణ పూర్తిచేశాం. మా దర్శకుడు చాలా సింపుల్‌గా తెరకెక్కించారు. పరిమిత బడ్జెట్‌లోనే సినిమాను బాగా రూపొందించారు. 


ఓటీటీ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘పరంపర’ నాకు మంచి పేరు తెచ్చింది.  ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’, ‘రామ్‌చరణ్‌ 15’ సహా మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. 

Updated Date - 2022-12-02T05:08:59+05:30 IST

Read more