సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్నేహమంటే ఇదేరా!

ABN, First Publish Date - 2022-08-08T06:14:02+05:30

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఒదెల దర్శకుడు. చెరుకూరి శ్రీనివాస్‌ నిర్మాత. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఒదెల దర్శకుడు. చెరుకూరి శ్రీనివాస్‌ నిర్మాత. కీర్తి సురేశ్‌  కథానాయికగా నటిస్తోంది. ఇది వరకెప్పుడూ లేని, మాస్‌ అవతార్‌లో దర్శనమిస్తున్నాడు నాని. గళ్ల చొక్కా, లుంగీ, మాసిన గెడ్డం, ఒత్తుగా పెరిగిన జుత్తు.. ఈ గెటప్‌ మాస్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు. ఆదివారం ఫ్రెండ్‌ షిప్‌ డే సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. నాని అండ్‌ గ్యాంగ్‌తో తీర్చిదిద్దిన ఈ పోస్టర్‌.. స్నేహానికి, వాళ్ల అల్లరికి నిదర్శనంగా కనిపిస్తోంది. సింగరేణి కోల్‌ మైన్స్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. నాని తొలిసారి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. సముద్రఖని, సాయి కుమార్‌, జరీనా వహాబ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేయబోతున్నారు. సంగీతం: సంతోష్‌ నారాయణన్‌. 


Updated Date - 2022-08-08T06:14:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!