పెళ్లికి ముహూర్తం కుదిరిందా?

ABN , First Publish Date - 2022-05-08T05:50:11+05:30 IST

హీరోయిన్‌ నయనతార, కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వివాహం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉన్న ఒక మఠంలో జూన్‌ నెల 9వ తేదీన ఈ వివాహం జరుగనుంది....

పెళ్లికి ముహూర్తం కుదిరిందా?

హీరోయిన్‌ నయనతార, కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ వివాహం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఉన్న ఒక మఠంలో జూన్‌ నెల 9వ తేదీన ఈ వివాహం జరుగనుంది. తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి నయనతార శుక్రవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. గత వారం కూడా ఈ ప్రేమజంట శ్రీనివాసుడిని దర్శనం చేసుకున్నారు. మళ్ళీ వారం రోజులు తిరగకముందే వారిద్దరు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం గమనార్హం. ఈ విషయంపై వారితో ఉన్న సన్నిహితుల వద్ద ప్రశ్నించగా, జూన్‌ నెలలో శ్రీవారి సన్నిధికి సమీపంలోని ఒక మఠంలో వీరి వివాహం జరుగనుందని, ఇందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయని వెల్లడించారు. అయితే, వివాహ తేదీపై ఈ ప్రేమజంట కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ స్పందించలేదు. కాగా, నయనతార - విఘ్నేష్‌ శివన్‌లు గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెల్సిందే. ఎక్కడకు వెళ్ళినా వీరిద్దరు కలిసే వెళుతున్నారు.

ఆంధ్రజ్యోతి, చెన్నై 

Updated Date - 2022-05-08T05:50:11+05:30 IST

Read more