సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Shakini Dakini : ఆ మార్పే కొంప ముంచిందా?

ABN, First Publish Date - 2022-09-18T16:54:48+05:30

కొరియన్ సినిమాల్ని యాజిటీజ్‌గా లేపేయడం మనవాళ్ళకి రీల్‌తో పెట్టిన విద్య. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్ని ఫ్రీమేక్ చేసుకొని ప్రేక్షకుల ముందుకొదిలేశారు చాలా మంది దర్శకులు. అయితే ‘ఓ బేబీ’ సినిమా నుంచి వెర్షన్ మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొరియన్ సినిమాల్ని యాజిటీజ్‌గా లేపేయడం మనవాళ్ళకి రీల్‌తో పెట్టిన విద్య. ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్ని ఫ్రీమేక్ చేసుకొని ప్రేక్షకుల ముందుకొదిలేశారు చాలా మంది దర్శకులు. అయితే ‘ఓ బేబీ’ సినిమా నుంచి వెర్షన్ మారింది. మిగలిన భాషలతో పోల్చితే.. తక్కువ రేట్స్ కే వస్తున్నాయి కొరియన్ మూవీస్. అందుకే  సూపర్ హిట్ కొరియన్ సినిమాల రైట్స్‌ను వరుసగా కొంటూ.. తమ శైలిలో మలుస్తున్నారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిన సినిమానే రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలైన ‘షాకిని డాకిని’ (Shakini Dakini). రెజినీ కసండ్రా (Regina casandra), నివేదా థామస్ (Niveda Thomas) ప్రధాన పాత్రలు పోషించారు. ‘మిడ్‌నైట్ రన్నర్స్’ (Midnight Runners) అనే కొరియన్ సూపర్ హిట్ మూవీకిది రీమేక్. అయితే ఒరిజినల్‌ది మేల్ వెర్షన్‌లో ఉంటుంది. 


ఇద్దరు హీరోలు (Park Seo-joon, Kang Ha-neul) నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సౌత్ కొరియాలో సూపర్ హిట్టైంది. అయితే అలా హిట్టవ్వడానికి కారణం అది మేల్ వెర్షన్ కావడమే. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన ఇద్దరు పోలీసులు ఓ కిడ్నాపింగ్ కేసును సాల్వ్ చేయడమే కథాంశం. అయితే తెలుగు వెర్షన్ కొచ్చేసరికి నిర్మాత సునీత (Sunitha) దాన్ని ఇద్దరు హీరోయిన్స్ కథగా మార్చారు. ఇద్దరు హీరోలుంటే కొత్త సమస్య వస్తుందనుకున్నారో లేక లేడీ నిర్మాత అయి ఉండి దీన్ని ఫిమేల్ వెర్షన్ లో ఎందుకు చేయకూడదనుకున్నారో తెలియదు కానీ. మొత్తం మీద దీన్ని మార్చారు. కథలో హీరోయిన్‌కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఈ రీమేక్ ను టాలీవుడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో పెట్టారు. అయితే విడుదలకు ముందు ఎంతగానో క్రేజ్ వచ్చిన ఈ సినిమాకు విడుదలయ్యాకా.. అంతగా రెస్పాన్స్ రావడం లేదు. 


రెజీనా, నివేదా యాక్టింగ్ విషయంలో పేరు పెట్టడానికి లేదు కానీ.. కథాంశం విషయంలోనే తప్పు జరిగిందని దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. దీన్ని ఫిమేల్ వెర్షన్ గా మార్చకుండా..  యాజిటీజ్‌గా మేల్ వెర్షన్ లోనే తీసి ఉంటే బాగుండేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఎవరైనా క్రేజీ యంగ్ హీరోలు నటించి ఉండుంటే.. మంచి ఓపెనింగ్స్ దక్కేవని అనుకుంటున్నారు. నిజానికి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీస్‌కు రీచ్ తక్కువ. ఎంత పెద్ద క్రేజీ హీరోయిన్ నటించినప్పటికీ.. హీరోలతో సమానంగా వసూళ్ళు రావడం ఎప్పుడో కానీ జరగదు. కాన్సెప్ట్ ఎంగేజింగ్ గానూ, సన్నివేశాలు ఎంతో ఆసక్తిగానూ ఉంటేనే తప్ప ప్రేక్షకులకు చేరదు. షాకిని డాకిని విషయంలో నిర్మాతలు ఈ కోణంలో ఆలోచించి ఉంటే బాగుండేదేమో. 

Updated Date - 2022-09-18T16:54:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!