సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nani: సినిమా రన్ టైమ్ ఇంత ఎక్కువా.?

ABN, First Publish Date - 2022-06-01T17:43:41+05:30

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే.. సుందరానికీ' (Ante Sundaraniki). తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ బాగా ఎక్కువని అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే.. సుందరానికీ' (Ante Sundaraniki). తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్ టైమ్ బాగా ఎక్కువని అంటున్నారు. గత ఏడాది డిసెంబర్ చివరిలో శ్యామ్ సింగరాయ్ (Shyam Singharoy) సినిమాతో వచ్చి హిట్ అందుకున్న నాని, అదే వరుసలో చిత్రాలను చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే, 'అంటే.. సుందరానికీ' (Ante Sundaraniki) చిత్రాన్ని పూర్తి చేశాడు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.


ఈ సినిమా ద్వారా మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ (Nazriya Nazim) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. మైత్రీ  మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని - రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. ఇందులో నదియా- హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ- సుహాస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, లిరికల్ వీడియో సాంగ్ వచ్చి బాగానే అంచనాలు పెంచాయి. త్వరలో థియేట్రికల్ ట్రైలర్ రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయట.


మొత్తం రన్ టైమ్ దాదాపు 3 గంటలని టాక్ వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ఇత రన్ టైమ్ తో రిలీజైన సినిమా ఒక్క ఆర్ఆర్ఆర్ (RRR) మాత్రమే. 3 గంటల 2 నిమిషాల రన్ టైమ్ తో  విడుదలై భారీ సక్సెస్ సాధించింది. అయితే..ఇలాంటి మీడియం రేంజ్ సినిమాను 3 గంటలు చూస్తారా..! అంటే అది కథపైనే ఆధారడి ఉంటుంది. మరి సుందరం రన్ టైమ్ ఎంత లాక్ చేస్తారో చూడాలి. కాగా, ఇప్పుడు నాని దసరా అనే ఓ విభిన్నమైన కథతో సాగే చిత్రాన్ని చేసున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్ (Keerthi Suresh) నటిస్తోంది. ఓదెల శ్రీకాంత్ (Odela Srikanth) దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాత. 

Updated Date - 2022-06-01T17:43:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!