Anil Ravipudi : బాలయ్య చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

ABN , First Publish Date - 2022-08-09T17:48:32+05:30 IST

‘ఎఫ్ 3’ (F3) చిత్రంతో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి దృష్టంతా నటసింహ బాలకృష్ణ (Balakrishna)తో తీయబోయే చిత్రంపైనే ఉంది. ఈ ఇద్దరి కాంబో మూవీ ఓకే అయిన సంగతి తెలిసిందే.

Anil Ravipudi : బాలయ్య చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

‘ఎఫ్ 3’ (F3) చిత్రంతో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి దృష్టంతా నటసింహ బాలకృష్ణ (Balakrishna)తో తీయబోయే చిత్రంపైనే ఉంది. ఈ ఇద్దరి కాంబో మూవీ ఓకే అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopi Chand Malineni) దర్శకత్వంలో బాలయ్య 107వ చిత్రం తెరకెక్కుతోంది. గతేడాది బాలకృష్ణ ‘అఖండ’ (Akhanda) చిత్రంతో అఖండం విజయం అందుకున్న నేపథ్యంలో ఈ సినిమా స్ర్కిప్ట్‌లో కొన్ని మార్పులు చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బరిలోకి దింపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనిల్ రావిపూడి కథాంశంలో కూడా కొన్ని ఛేంజెస్ వచ్చి చేరాయని టాక్. బాలయ్య సినిమాను తెరకెక్కించడానికి అనిల్‌కు ఇంకా సమయం ఉంది. అందుకే స్ర్కిప్ట్‌ను పకడ్బందీగా రాస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అనిల్ వైజాగ్‌లో ఉన్నారు. ఈ సినిమా స్ర్కిప్ట్ పైనే ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. 


తాజా సమాచారం ప్రకారం.. బాలకృష్ణ సినిమాకి సంబంధించిన డైలాగ్ వెర్షన్ ఫస్టాఫ్ పూర్తయిందట. బాలయ్యకి డైలాగ్ వెర్షన్ వినిపించి ఫస్టాఫ్‌ను లాక్ చేశారని వినికిడి. నెలాఖరుకు సెకండాఫ్ ను కూడా లాక్ చేసి.. నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ ను ఫైనల్ చేస్తారట. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అనిల్ రావిపూడి ఈ సినిమాకోసం తన కామెడీ స్కిల్స్‌ను పక్కన పెట్టి పక్కా యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారట. ఇప్పటివరకూ అనిల్ కామెడీ ఎంటర్‌టైన్ మెంట్సే తీశారు. తొలి చిత్రం ‘పటాస్’ (Patas) నుంచి ‘ఎఫ్ 3’ చిత్రాల వరకూ తన ట్రేడ్ మార్క్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించారు. అయితే బాలయ్య సినిమాతో కామెడీ జోనర్ నుంచి పూర్తిగా బైటికి వస్తున్నట్టు సమాచారం. ‘పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్, సరిలేరు నీకెవ్వురు’ చిత్రాల్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసినప్పటికీ.. వాటిలో కామెడీ పుష్కలంగా ఉంటుంది.


కానీ బాలకృష్ణ చిత్రంలో అవసరం మేరకే ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందట. టోటల్ మూవీ అంతా బాలయ్య మార్క్ సినిమాగానే తెరకెక్కుతుందట. తొలిసారిగా అనిల్  తనది కాని జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కించబోతుండడం గమనార్హం. బాలయ్య గతంలో ఎన్నడూ టచ్ చేయని ఒక పాయింట్‌తో అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు టాక్. డైలాగ్స్ కూడా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉంటాయని చెబుతున్నారు. మరి బాలయ్యతో అనిల్ ఏ తరహా కథాంశం తెరకెక్కిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-08-09T17:48:32+05:30 IST

Read more