ఆసక్తికరంగా Aham Reboot గ్లింప్స్..
ABN , First Publish Date - 2022-06-15T18:27:14+05:30 IST
అక్కినేని హీరో సుమంత్ (Sumanth) నటిస్తున్న చిత్రాలలో 'అహం' రీబూట్ (Aham Reboot) కూడా ఒకటి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంటోంది.

అక్కినేని హీరో సుమంత్ (Sumanth) నటిస్తున్న చిత్రాలలో 'అహం' రీబూట్ (Aham Reboot) కూడా ఒకటి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంటోంది. ప్రేమకథ, సత్యం, గౌరీ, మధుమాసం, మహానంది, మళ్ళీరావా లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సుమంత్ ఆ తర్వాత నుంచి మాత్రం సాలీడ్ హిట్ అందుకోలేపోతున్నాడు. కెరీర్ కాస్త స్లోగా సాగుతున్నప్పటికీ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక తాజాగా నటిస్తున్న 'అహం' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
వాయుపుత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి (Prashanth Sagar Atluri) దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు. సుమంత్ ఈ సినిమాలో రేడియో జాకీగా కనిపించబోతున్నాడని ఈ గ్లింప్స్ వీడియోను చూస్తే అర్థమవుతుంది. 'ఆఫర్ట్ పార్టీ' అనే టాక్ షోతో రేడియోలో ఆన్ ఎయిర్ ఉండగా ఒక అమ్మాయి నుండి కాల్ వచ్చి.. 'దయచేసి కట్ చేయవద్దు. నేను డేంజర్ లో ఉన్నాను... నన్ను కిడ్నాప్ చేశారు.. కాపాడండి'.. అంటూ కోరుతుంది.
అప్పుడు హీరో ఏం చేశాడు.. అనేది సినిమాలో చూడాల్సిందే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తున్న సుమంత్‌కు ఇప్పుడు నటిస్తున్న 'అహం' రీబూట్ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. తాజాగా గ్లింప్స్ అయితే సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతోంది. ఇక త్వరలో ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించనుంది. ఈ మూవీతో పాటుగా మరో రెండు సినిమాలలోనూ నటిస్తున్నాడు సుమంత్.