‘ఊ.. అంటావా..’ పాట సింగర్‌కు Goldmedal
ABN , First Publish Date - 2022-05-17T17:45:31+05:30 IST
కాన్స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ అత్యధిక వసూళ్ళను రాబట్టింది. మొదటి భాగం సూపర్ హిట్‌తో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఏ స్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ అత్యధిక వసూళ్ళను రాబట్టింది. మొదటి భాగం సూపర్ హిట్‌తో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘పుష్ప’ ఘనవిజయానికి అందులోని పాటలు ఎంతో దోహదం చేశాయి. ‘దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, హే బిడ్డా ఇది నా అడ్డా, సామి సామి’ లాంటి పాటలు అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఇక వీటితో పాటు మరో పాట పుష్ప చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందాల సమంత నర్తించిన ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. ’ అనే పాటకు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఏర్పడింది. చంద్రబోస్ (Chandra Bose) రచించిన ఈ పాటకోసం దేవీశ్రీ ప్రసాద్ మాసీ ట్యూన్ అందించి.. 2021వ సంవత్సరానికే చార్ట్ బస్టర్‌గా మార్చాడు. ఈ పాటను మంగ్లీ (Mangli) చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ (Indravathi chouhan) ఆలపించిన సంగతి తెలిసిందే. ఈ పాటకు గాను ఆమె గోల్డ్ మెడల్ అందుకోవడం విశేషం.
ప్రముఖ డిజిటల్ మీడియా గ్రూప్ ‘బిహైండ్ వుడ్’ (Behind wood) వారు ఏ ఏడాదితో 19 ఏళ్ళను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన యానివర్సరీ సెలబ్రేషన్స్ (Anniversary celebrations) లో భాగంగా.. మే 22న ఈ ఏడాది అత్యధిక ప్రజాదరణ పొందిన సినిమాలు, నటులు, సింగర్స్ కు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనుంది. అందులో భాగంగానే బెస్ట్ సింగర్ విభాగంలో ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావా.. ఉఊ.. అంటావా మావా’ పాటను ఆలపించి.. దాన్ని జనంలోకి బాగా తీసుకెళ్ళిన ఇంద్రావతి చౌహాన్‌ను (Indravathi chouhan) ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకొన్న ఇంద్రావతి (Indravathi chouhan) మే 22న ‘ఊ అంటావా మావా.. ఉఊ.. అంటావా మావా’ పాటకు గోల్డ్ మెడల్ అందుకోబోతున్నానని, తనకు ఈ గుర్తింపు రావడానికి కారణం సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ (Devisri prasad) అని, ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఇది నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపింది. నిజంగా ఇంద్రావతి గొంతు, ఆ పాటలో నర్తించిన సమంతకు పెర్ఫెక్ట్గా సెట్ అయింది. అందుకే అభిమానులు ఈ పాటను, సమంతను ఎప్పటికీ మరిచిపోలేరు. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read more