భద్రత పెరిగింది

ABN , First Publish Date - 2022-11-02T10:07:59+05:30 IST

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యక్తిగత భద్రత పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు వై ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీ...

భద్రత పెరిగింది

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యక్తిగత భద్రత పెంచుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు వై ప్లస్‌ కేటగిరి సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మరో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌కు ఎక్స్‌ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తారు. లారెన్స్‌ బిష్నోయి గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబీ గాయకుడు సిద్దు మూసేవాలా హత్య వెనుక ఈ గ్యాంగ్‌ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్‌కు ఇటీవలే రివాల్వర్‌ లైసెన్స్‌ కూడా ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్స్‌ లారెన్స్‌ బిష్నోయి, గోల్డీ బ్రార్‌ సల్మాన్‌ మీద దాడి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారనే పక్కా సమాచారం పోలీసుల దగ్గర ఉంది. సల్మాన్‌ పుట్టిన రోజు సందర్భంగా 2017లో సల్మాన్‌ ఇంటి బయట, 2018 లో ఆయన ఫామ్‌ హౌస్‌లో రెండు సార్లు ఈ గ్యాంగ్‌స్టర్స్‌ చేసిన దాడి నుంచి సల్మాన్‌ తప్పించుకోగలిగారు. ఈ సారి గురి తప్పకూడదని గ్యాంగ్‌స్టర్స్‌ భావిస్తుండడంతో సల్మాన్‌కు భద్రత పెంచింది మహారాష్ట్ర ప్రభుత్వం.


Updated Date - 2022-11-02T10:07:59+05:30 IST

Read more