రొమాంటిక్‌ స్పాట్‌లో... రవితేజ

ABN , First Publish Date - 2022-03-17T09:33:52+05:30 IST

మాస్‌ యాక్షన్‌లోనే కాదు రొమాంటిక్‌ ఘట్టాల్లోనూ రవితేజ నటనకు ఓ మార్క్‌ ఉంది. దానికి తగ్గట్టే దర్శకులు కూడా రవితేజ చిత్రంలో రొమాంటిక్‌ సీన్లకు పెద్ద పీట వేస్తుంటారు...

రొమాంటిక్‌ స్పాట్‌లో... రవితేజ

మాస్‌ యాక్షన్‌లోనే కాదు రొమాంటిక్‌ ఘట్టాల్లోనూ రవితేజ నటనకు ఓ మార్క్‌ ఉంది. దానికి తగ్గట్టే దర్శకులు కూడా రవితేజ చిత్రంలో రొమాంటిక్‌ సీన్లకు పెద్ద పీట వేస్తుంటారు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ చిత్రం ‘ధమాకా’. ‘డబుల్‌ ఇంపాక్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇటీవలె ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ నేతృత్వంలో రవితేజపై హైదరాబాద్‌లో హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణ పూర్తయింది. ఇక ఇప్పుడు రవితేజను మరింత రొమాంటిక్‌గా చూపించే పనిలో ఉన్నారు దర్శకుడు నక్కిన త్రినాథరావు. ప్రస్తుతం స్పెయిన్‌లో హీరో, హీరోయిన్లపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. అక్కడి ప్లాజా డి ఎస్పానా అనే చారిత్రక ప్రదేశంలో రవితేజ, శ్రీలీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్‌ ప్రదేశంగా దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండడంతో అక్కడే పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాత.  సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో. కథ, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ. 


Updated Date - 2022-03-17T09:33:52+05:30 IST

Read more