రీమేక్ సాంగ్స్ రికార్డింగ్‌లో...
ABN, First Publish Date - 2022-12-28T02:39:17+05:30
‘‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రంతో దర్శకురాలిగా ఘన విజయం అందుకున్నారు సుధా కొంగర.
‘‘సూరారై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) చిత్రంతో దర్శకురాలిగా ఘన విజయం అందుకున్నారు సుధా కొంగర. సూర్య హీరోగా నటించిన ఈచిత్రం 2020లో ఓటీటీలో విడుదలై చక్కని ప్రేక్షకాధరణ పొందింది. పలు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకొంది. ఇటీవలె ఈ చిత్రం హిందీ రీమేక్‌ను సుధా కొంగర ప్రకటించారు. అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. రాధికా మదన్ కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం రీమేక్‌కు సంబంధించిన హిందీ పాటల రికార్డింగ్ జరుగుతోంది, రీమేక్‌లో అన్నీ కొత్త పాటలే ఉంటాయని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సుధా కొంగరతో దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. సూర్య, జ్యోతిక దంపతులు తమ 2డి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై అబుండాంటియా ఎంటర్టైన్‌మెంట్‌తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.