National Cinema Day: థియేటర్స్‌లో కొత్త రికార్డు..!
ABN, First Publish Date - 2022-09-24T23:40:24+05:30
భారత్ అంతట సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే (National Cinema Day)ను ‘ద మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (The Multiplex Association of India) (MAI) నిర్వహించింది. ఆ రోజున
ద మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (The Multiplex Association of India) (MAI) భారత్ అంతట సెప్టెంబర్ 23న నేషనల్ సినిమా డే (National Cinema Day)గా సెలబ్రేట్ చేసింది. ఆ రోజున టికెట్‌ను రూ.75కే విక్రయించింది. నేషనల్ సినిమా డేలో పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, మిరాజ్, సిటి ప్రైడ్, ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఏమ్ 2కే వంటి మల్టీఫ్లెక్సెస్ పాల్గొన్నాయి. ఇండియాలోని 4వేలకు పైగా స్క్రీన్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. నేషనల్ సినిమా డేకు ప్రేక్షకులు లక్షలాదిగా తరలివచ్చారు. భారీ స్థాయిలో జయప్రదం చేశారు. థియేటర్స్‌కు సెప్టెంబర్ 23న 65లక్షలమంది ప్రేక్షకులు వచ్చారని మల్టీప్లెక్స్ అసోసోయేషన్ తెలిపింది. ఈ స్థాయిలో ప్రేక్షకులు రావడం సరికొత్త రికార్డు అని పేర్కొంది.
థియేటర్స్‌కు భారీ ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చారని ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రకటన జారీ చేసింది. ‘‘నేషనల్ సినిమా డేకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టికెట్స్‌కు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటంతో ఉదయం ఆరు గంటలకే షోస్‌ను ప్రారంభించాం. సెప్టెంబర్ 23న రికార్డు స్థాయిలో 65లక్షల మంది ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చారు. రోజంతా హౌస్‌ఫుల్ షోస్‌లు నడిచాయి. ఈ ఏడాది అత్యధిక మంది థియేటర్‌ను వీక్షించిన రోజుగా సెప్టెంబర్ 23 నిలిచింది’’ అని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నియమ, నిబంధనల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో రూ.75కు టికెట్‌ను అందించలేదు. దీంతో హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్ టికెట్‌ను రూ. 112కు అందించాయి.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని థియేటర్ యాజమాన్యాలు సెప్టెంబర్ 3న ‘నేషనల్ సినిమా డే’ గా జరిపాయి. సెలబ్రేషన్స్‌లో భాగంగా సెప్టెంబర్ 3న టికెట్‌ను కేవలం మూడు డాలర్లకే అందించాయి. ఈ సందర్భంగా సినిమా లవర్స్ వేలాదిగా తరలివచ్చి ఆ రోజును జయప్రదం చేశారు. ఫలితంగా అమెరికాను స్ఫూర్తిగా తీసుకుని ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ మన దేశంలో కూడా సెప్టెంబర్ 23న ‘నేషనల్ సినిమా డే’ను సెలబ్రేట్ చేశాయి. అమెరికాలో మాదిరిగానే ఇండియాలో కూడా నేషనల్ సినిమా డేకు మంచి స్పందన లభించింది.