సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హిందీలోనూ... ది ఘోస్ట్‌!

ABN, First Publish Date - 2022-09-27T06:14:24+05:30

ఇప్పుడంతా పాన్‌ ఇండియా చిత్రాలదే హవా. పెద్ద హీరో సినిమా తయారవుతోందంటే దాన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేయాల్సిందే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పుడంతా పాన్‌ ఇండియా చిత్రాలదే హవా. పెద్ద హీరో సినిమా తయారవుతోందంటే దాన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేయాల్సిందే. అగ్ర కథానాయకుడు నాగార్జున కూడా ఒకప్పుడు బాలీవుడ్‌ లో సినిమాలు చేసినవాడే. ఈమధ్య ‘బ్రహ్మాస్త్ర’లోనూ ఓ కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు తన కొత్త సినిమా ‘ది ఘోస్ట్‌’ విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్రబృందం. నిజానికి ఈ సినిమాని కేవలం తెలుగుకే పరిమితం చేద్దామనుకొన్నారు. కానీ అవుట్‌పుట్‌ చూశాక.. ‘ఘోస్ట్‌’ని హిందీలోనూ విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్‌లో మంచి వసూళ్లు అందుకొంది. ఆ క్రేజ్‌ ‘ఘోస్ట్‌’కి ఉపయోగపడుతుందని నిర్మాతల అంచనా. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. అక్టోబరు 5న విడుదల కానుంది.


Updated Date - 2022-09-27T06:14:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!