యాక్షన్‌ మోడ్‌లో... చిరు

ABN , First Publish Date - 2022-03-28T06:26:14+05:30 IST

చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. మైత్రీ మూవీస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక...

యాక్షన్‌ మోడ్‌లో... చిరు

చిరంజీవి కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. మైత్రీ మూవీస్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. మరో కథానాయకుడు రవితేజ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవిపై ఓ మాస్‌ ఫైట్‌ని తెరకెక్కిస్తున్నారు. దీనిని ఫైట్‌మాస్టర్లు రామ్‌ - లక్ష్మణ్‌ కంపోజ్‌ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో శ్రుతిహాసన్‌ కూడా పాల్గొననున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రమిది. చిరు పాత్ర తీరుతెన్నులు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుంది. రామ్‌ లక్ష్మణ్‌ కంపోజ్‌ చేస్తున్న ఈ ఫైట్‌ సినిమాలోని కీలకమైన ఘట్టంలో వస్తుంది. ఈ పోరాట దృశ్యాలు అభిమానులకు కిక్‌ ఇస్తాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిరు - దేవిశ్రీ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలూ మ్యూజికల్‌ హిట్సే. ఆ జాబితాలో ఈ చిత్రం కూడా చేరుతుంద’’న్నారు. ఈ చిత్రానికి కథ: బాబి, స్ర్కీన్‌ ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తి రెడ్డి, కెమెరా: ఆర్థర్‌ ఎ.విల్సన్‌.


Updated Date - 2022-03-28T06:26:14+05:30 IST