మెప్పించే మీలో ఒకడు

ABN , First Publish Date - 2022-06-01T11:16:01+05:30 IST

కుప్పిలి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మీలో ఒకడు’. సుమన్‌ కీలక పాత్రలో నటించారు...

మెప్పించే మీలో ఒకడు

కుప్పిలి శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘మీలో ఒకడు’. సుమన్‌ కీలక పాత్రలో నటించారు. హ్రితిక సింగ్‌, సాధన పవన్‌ కథానాయికలు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ను ఇటీవలె చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ ‘శ్రీనివాస్‌ సినిమాను కాంప్రమైజ్‌ కాకుండా తీశారు. కథలో మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి’ అన్నారు. హీరో మాట్లాడుతూ ‘నా అభిమాన హీరో సుమన్‌ గారు మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఆయన సలహాలు, సూచనలు సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి’ అని చెప్పారు. కుప్పిలి వీరాచారి నిర్మించిన ఈ చిత్రానికి జై సూర్య సంగీతం అందించారు. 


Updated Date - 2022-06-01T11:16:01+05:30 IST

Read more