సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

IMDB Top Ten movies: మొదటి స్థానంలో విక్రమ్‌.. మరి ఆర్‌ఆర్‌ఆర్‌!

ABN, First Publish Date - 2022-07-14T05:46:34+05:30

కరోనా కోరల్లో చిక్కుకున్న చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ప్రారంభం నుంచి కాస్త దార్లోకి వచ్చింది. జనవరిలో థర్డ్‌ వేవ్‌ భయం వెంటాడినా.. నిర్మాతలు ధైర్యం చేసి ప్రేక్షకులకు సినిమాలు అందించారు. విభిన్నమైన కథలతో సినిమాలు థియేటర్‌లలో సందడి చేశాయి. అందులో కొన్ని మెప్పించాయి. అంచనాలకు మించి వసూళ్లు రాబట్టాయి. మరికొన్ని చిత్రాలు మాత్రం అంచనాలు అందుకోలేకపోయాయి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కోరల్లో చిక్కుకున్న చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ప్రారంభం నుంచి కాస్త దార్లోకి వచ్చింది. జనవరిలో థర్డ్‌ వేవ్‌ భయం వెంటాడినా.. నిర్మాతలు ధైర్యం చేసి ప్రేక్షకులకు సినిమాలు అందించారు. విభిన్నమైన కథలతో సినిమాలు థియేటర్‌లలో సందడి చేశాయి. అందులో కొన్ని మెప్పించాయి. అంచనాలకు మించి వసూళ్లు రాబట్టాయి. (Imdb Top ten indian movies list)మరికొన్ని చిత్రాలు మాత్రం అంచనాలు అందుకోలేకపోయాయి, అభిమానులను నిరాశపరిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకూ అంటే ఆరు నెలల కాలంలో వందల సంఖ్యలో సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో నుంచి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన చిత్రాలను ‘మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ ఫిల్మ్స్‌’(Most popular indian films ) పేర 10 సినిమాలను ప్రకటించింది ఐఎండీబీ సంస్థ. ఈ పోర్టల్‌ వినియోగదారులను ఆధారంగా తయారు చేసిన జాబితాలో విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్‌’ (Vikram)8.8 రేటింగ్‌తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (KGF 2) (8.5 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. టాప్‌టెన్‌ చిత్రాల్లో మిగిలిన చిత్రాలు స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. 

1. ‘విక్రమ్‌’ (8.8)

2. ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ (8.5)

3. ది కశ్మీర్‌ ఫైల్స్‌ (8.3)

4. హృదయం (8.1)

5. ఆర్‌ఆర్‌ఆర్‌ (8.0)(RRR)

6. ఏ థర్స్‌డే (7.8)

7. ఝండ్‌ (7.4)

8. రన్‌వే 34  7.2

9. సమ్రాట్‌ పృథ్వీరాజ్‌ (7.2)

10. గంగూభాయ్‌ కతియావాడి (7.0)

Updated Date - 2022-07-14T05:46:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!