ఇది అల్లరోడి ఉగ్రరూపం

ABN , First Publish Date - 2022-08-23T05:46:24+05:30 IST

అల్లరి నరేశ్‌లోని మరో కోణాన్ని చూపించిన చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు....

ఇది అల్లరోడి ఉగ్రరూపం

అల్లరి నరేశ్‌లోని మరో కోణాన్ని చూపించిన చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే  కాకుండా విమర్శకుల ప్రశంసలు దక్కించుకొంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతోంది. అదే... ‘ఉగ్రం’. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలు. సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. దామోదర ప్రసాద్‌ స్విచ్చాన్‌ చేశారు. అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ని సైతం విడుదల చేశారు. టైటిల్‌కి తగ్గట్టుగానే నరేశ్‌ ఉగ్రరూపం ఈ పోస్టర్‌లో కనిపించింది. ఒంటి నిండా రక్తం, వీపున గుచ్చుకొన్న కత్తితో నరేశ్‌ లుక్‌ వైవిధ్యంగా ఉంది. ‘‘ఇదో వైవిధ్యమైన కథ. ‘నాంది’లానే సరికొత్త ప్రయోగం. నరేశ్‌ని వరకు చూడని పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటీనటులంతా ఈ సినిమాలో కనిపిస్తారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. కథ: తూము వెంకట్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఫొటోగ్రఫీ: సిద్ద్‌.


Updated Date - 2022-08-23T05:46:24+05:30 IST

Read more