ఇద్దరమ్మాయిల ప్రేమకథ
ABN , First Publish Date - 2022-03-27T06:14:42+05:30 IST
రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఇష్టం’. అప్సర, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది...

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఇష్టం’. అప్సర, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తెలుగు హక్కుల్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 8న విడుదల అవుతోంది. ‘‘మిగిలిన అన్ని భాషల్లోనూ ‘డేంజర్’ పేరుతో ఈ సినిమా రూపొందింది. తెలుగులో మాత్రం ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టాం. ఇద్దరమ్మాయిల ప్రేమకథ ఇది. తెలుగులో ఈ తరహా కథతో సినిమా రూపొందించడం ఇదే తొలిసారి. గతంలో మా సంస్థ నుంచి ‘ఐస్‌క్రీమ్’ అనే సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది. ‘మా ఇష్టం’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుంద’’న్నారు నిర్మాత.