సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Natti Karuna: ఐకానిక్ ఇండియా అందాల పోటీ విజేతగా తెలుగమ్మాయ్!

ABN, First Publish Date - 2022-06-02T23:15:45+05:30

ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 (Iconic India beauty contest 2022) టైటిల్ విజేత (Title Winner)గా నటి నట్టి కరుణ (Natti Karuna) నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకానిక్ ఇండియా అందాల పోటీ  2022 (Iconic India beauty contest 2022) టైటిల్ విజేత (Title Winner)గా నటి నట్టి కరుణ (Natti Karuna) నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన  పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్‌గా నట్టి కరుణ విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ (Natti Kumar) కుమార్తె అయిన నట్టి కరుణ.. తమ సొంత బ్యానర్‌లో నిర్మాతగా  కొన్ని చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే నటన పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా హీరోయిన్‌గానూ కొన్ని చిత్రాలలో నటించారు. ఆమె తొలి ప్రయత్నంగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ‘డిఎస్‌జె’ (DSJ) (దయ్యంతో సహజీవనం) చిత్రం ఇటీవల విడుదలై, నటిగా ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. ఈ నేపథ్యంలో నటిగా మరింత పేరు తెచ్చుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కరుణ.. ఐకానిక్ ఇండియా అందాల పోటీ  2022 టైటిల్ గెలుచుకుని.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. 


ఈ నేపథ్యంలో నట్టి కరుణ మాట్లాడుతూ.. ‘‘వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో పోటీపడి, ఈ టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా, థ్రిల్లింగ్‌గా ఉంది. త్వరలో గోవా, కేరళలో జరగబోయే అందాల పోటీలలో కూడా పాల్గొనబోతున్నాను. సినిమా రంగం విషయానికి వస్తే, తాజాగా తెలుగులో రూపొందుతున్న ఓ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాను. ఇందులో  హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు.. నటించడానికి అవకాశం ఉన్నటువంటి చక్కటి పాత్ర. ఇంకా తమిళంలో ఓ చిత్రంలో నటించమని ఆఫర్ వచ్చింది. ఆ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఓ అచ్చ తెలుగమ్మాయిగా తెలుగు చిత్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూనే.. ఇతర భాషల చిత్రాలు చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-02T23:15:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!