నచ్చితే ఎలాంటి పాత్రయినా చేస్తాను
ABN, First Publish Date - 2022-08-16T05:34:18+05:30
తేజస్వి మదివాడ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కమిట్మెంట్’. ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు...
తేజస్వి మదివాడ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కమిట్మెంట్’. ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నించే యువతి పాత్రను పోషించాను. ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుంది. మంచి సందేశం ఉంది. నటిగా నాకు మంచి పేరు తెస్తుంది. కథ నచ్చితే ఎలాంటి పాత్రలయినా చేస్తాను. ‘బిగ్బాస్’ వల్ల ఇల్లు, కారు కొనుక్కున్నాను. ప్రస్తుతం ఒక హిందీ చిత్రం చేస్తున్నాను’ అన్నారు.