సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హ్యాపీగా అనిపించింది

ABN, First Publish Date - 2022-07-06T05:56:28+05:30

‘‘దర్శకుడు రితేష్‌ రానా నన్ను చూసి, ‘హ్యాపీ’ పాత్రను రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ‘హ్యాపీ’ పాత్రలో నటిస్తుంటే చాలా రోజుల తర్వాత హ్యాపీగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘దర్శకుడు రితేష్‌ రానా నన్ను చూసి, ‘హ్యాపీ’ పాత్రను రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ‘హ్యాపీ’ పాత్రలో నటిస్తుంటే చాలా రోజుల తర్వాత హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా, అందులో నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి’’ అని లావణ్య త్రిపాఠి అన్నారు. ఆమె లీడ్‌రోల్‌లో నటించిన ‘హ్యాపీ బర్త్‌డే’ చిత్రం వచ్చే  శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా లావణ్య పంచుకున్న చిత్ర విశేషాలు



ఈ సినిమా జానర్‌, కథ, కథనం అన్నీ కొత్తగా ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను రోజూ జిమ్‌, బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. కానీ తొలిసారి తెరపై యాక్షన్‌ పండించే అవకాశం దక్కింది. 

కథ వినగానే నాకు బాగా నచ్చింది. చాలా కొత్త జానర్‌. ఊహల్లో జరిగే కథ. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో సినిమా చేయడం ఆనందంగా  ఉంది. 


సీరియస్‌ పాత్రలు ఎక్కువగా చేయడం వల్లనేమో నేను కూడా సీరియస్‌గా ఉంటానని అనుకుంటున్నారు. కానీ నేను చాలా సరదాగా ఉంటాను. 


కథలో కీలకమైన పాత్ర నాది. చాలా ఫన్‌ ఉంటుంది. అందరినీ నవ్విస్తుంది. మొదటిసారి గన్‌ పట్టుకోవడం కొత్తగా అనిపించింది. మేకప్‌ వేసుకోవడం, పది కిలోల బరువున్న తుపాకిని మోస్తూ నటించడం కష్టంగా అనిపించింది.


ఒక నటిగా బలమైన పాత్రలు చేయాలనేది నా కోరిక. చేసిన పాత్రలే చేయడం నాకు నచ్చదు. దానివల్లే సినిమాలు తగ్గినట్లు అనిపిస్తోంది. తమిళంలో అథర్వతో చేస్తున్న చిత్రం దాదాపు పూర్తయింది. 

Updated Date - 2022-07-06T05:56:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!