టైటిల్ ఇంత వైరల్ అవుతుందనుకోలేదు
ABN , First Publish Date - 2022-10-30T09:40:43+05:30 IST
‘దండుపాళ్యం’తో ఆకట్టుకొన్న దర్శకుడు శ్రీనివాస్ రాజు. ఇప్పుడు ‘తగ్గేదే లే’ అంటూ మరో కథ చెప్పబోతున్నారు....

‘దండుపాళ్యం’తో ఆకట్టుకొన్న దర్శకుడు శ్రీనివాస్ రాజు. ఇప్పుడు ‘తగ్గేదే లే’ అంటూ మరో కథ చెప్పబోతున్నారు. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘కరోనా సమయంలో ‘తగ్గేదే లే..’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే టైటిల్‌ని మా సినిమాకి ఎంచుకొన్నాం. టైటిల్ పెట్టగానే అందరిలో వెళ్లిపోయింది. ఇంత వైరల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ‘తగ్గేదే లే’ అన్నట్టు ప్రవర్తిస్తుంటుంది. అందుకే ఈ పేరు పెట్టాం. ఇదో మర్డర్ మిస్టరీ. అయితే ప్రేమకథకు కూడా ప్రాధాన్యం ఉంది. సినిమాలో సగం ప్రేమకథే ఉంటుంది. ఆ సన్నివేశాలన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. తెలిసిన కథనే సింపుల్‌గా చెప్పడం నాకు ఇష్టం. ‘తగ్గేదే లే’ కూడా అలాంటి కథే. బుర్రకు పని పెట్టలేదు. సరదాగా చూస్తూ కూర్చుండిపోవొచ్చు. నాకు ఒకే రకమైన సినిమాలు తీయడం ఇష్టం ఉండదు. ప్రతీ సినిమాకీ ఓ కొత్త జోనర్ ప్రయత్నించాలని ఉంటుంది. రాబోయే రోజుల్లోనూ ఇలానే కొత్త తరహాలో ఆలోచిస్తా’’ అన్నారు.