వరుణ్ తేజ్‌ను చూసి చాలా గర్వపడతాను: అల్లు అర్జున్

ABN , First Publish Date - 2022-04-03T20:52:20+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 8వ తేదీన థియేటర్లలో

వరుణ్ తేజ్‌ను చూసి చాలా గర్వపడతాను: అల్లు అర్జున్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెల 8వ తేదీన థియేటర్లలో భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.." 'గని' సినిమాకి మా అన్నయ్య నిర్మాత. తెర వెనుక తాను చాలా కాలంగా ఎన్నో సినిమాలకి పనిచేశాడు. ఆ సమయంలో తాను కూడా మా నాన్నలా ఓ నిర్మాత అయితే బాగుండేదని అనిపించేది. 'గని' సినిమాతో ఆ కోరిక నెరవేరింది. మా నాన్నతో పాటు తన సపోర్టు కూడా నాకు ఉంటుంది. నేను ఎంపిక చేసుకునే కథల్లో.. నేను చేసే సినిమాల్లో తను చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు. తనకి నిర్మాతగా ఇది మొదటి సినిమానే కావొచ్చు. కానీ, సినిమా రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. తాను ఒక కథను ఓకే చేశాడంటే అది మినిమమ్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇక సిద్ధూకీ సినిమాలంటే చాలా ఇష్టం. అందుకే యూఎస్ లో జాబ్ మానుకుని ఇండస్ట్రీ వైపు వచ్చాడు. ఇద్దరూ కూడా నిర్మాతలుగా సక్సెస్ అవుతారనే నమ్మకం నాకు ఉంది"..అన్నారు.


ఇక వరుణ్ అంటే చాలా ఇష్టం. తను ఎంచుకునే కథలను చూసి నేను గర్వపడుతూ ఉంటాను. రెగ్యులర్ సినిమాలు కాకుండా ఏదో కొత్తగా చేయాలి అని వరుణ్ పడే తపన తనలో చాలాసార్లు చూశాను. ఇప్పటివరకు వరుణ్  చాలా సేఫ్‌గా ముందుకు వెళుతున్నాడు. ఇలాంటి సమయంలో కొత్త  దర్శకుడితో మూవీ చేయడమనేది రిస్క్. ఈ విషయంలో తనని అభినందిస్తున్నాను. వరుణ్ తేజ్ సినిమాలన్నీ ఒక ఎత్తు .. ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. దీని కోసం తను మామూలుగా కష్టపడలేదు. వరుణ్‌లో ఉన్న కసి.. హార్డ్ వర్క్ చూశాను.. గనుక ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను చూశాను.. నాకు నచ్చింది..అని అల్లు అర్జున్ అన్నారు. 

Updated Date - 2022-04-03T20:52:20+05:30 IST

Read more