హంట్‌కు హాలీవుడ్‌ టచ్‌

ABN , First Publish Date - 2022-11-26T07:01:49+05:30 IST

సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘హంట్‌’. మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

హంట్‌కు హాలీవుడ్‌ టచ్‌

సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘హంట్‌’. మహేష్‌ దర్శకత్వంలో వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటోంది. పోలీస్‌ వ్యవస్థ నేపథ్యంలో హై వోల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ పనిచేశారు. మార్వెల్‌ స్టూడియోస్‌ చిత్రాలకు పనిచేసిన రేనాడ్‌ ఫవేరో, బ్రయాన్‌ విజియర్‌ ‘హంట్‌’లో స్టంట్స్‌ కంపోజ్‌ చేశారు. వి. ఆనంద్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘సుధీర్‌ బాబు పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం. యాక్షన్‌ ఘట్టాలు సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయ’ని అన్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ‘ప్రేమిస్తే’ భరత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: జిబ్రాన్‌. సినిమాటోగ్రఫీ: అరుల్‌ విన్సెంట్‌

Updated Date - 2022-11-26T07:01:49+05:30 IST

Read more